రాణించిన ఆసీస్ బౌలర్లు... ఈసారి 200 లోపే టీమిండియా స్కోరు
- టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20
- రాయ్ పూర్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి మూడు మ్యాచ్ ల్లో ప్రతిసారి 200కి పైగా పరుగులు స్కోరు చేసిన టీమిండియా... నాలుగో టీ20లో మాత్రం ఆ పని చేయలేకపోయింది. రాయ్ పూర్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా... టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది.
ఆసీస్ బౌలర్లు సమయోచితంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు నమోదు చేయగలిగింది. హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ 19 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సులతో 35 పరుగులు సాధించాడు.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 37, రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్ (8), సూర్యకుమార్ యాదవ్ (1) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షూయిస్ 3, జాసన్ బెహ్రెండార్ఫ్ 2, తన్వీర్ సంఘా 2, ఆరోన్ హార్డీ 1 వికెట్ తీశారు.