బంగాళాఖాతంలో వాయుగుండం... తుపానుగా మారితే ఏపీ వైపే గురి!
- ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం
- డిసెంబరు 5న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం
- గంటకు 100 కి.మీ వేగంతో గాలులు... కుండపోత వర్షాలు
- ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరికి ఎల్లో అలర్ట్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది డిసెంబరు 2న తీవ్ర వాయుగుండంగా మారుతుందని, డిసెంబరు 3 నాటికి తుపానుగా రూపొంతరం చెందుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
తుపానుగా మారితే దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని... ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిపైనా తుపాను ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ప్రస్తుతం వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 740 కి.మీ... నెల్లూరుకు ఆగ్నేయంగా 860 కి.మీ... బాపట్లకు ఆగ్నేయ దిశగా 930 కి.మీ... మచిలీపట్నంకు ఆగ్నేయ దిశగా 910 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తుపానుగా మారిన అనంతరం డిసెంబరు 4వ తేదీ మధ్యాహ్నం దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరువలోకి వస్తుందని ఐఎండీ వివరించింది.
ఈ నెల 5న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది.
డిసెంబరు 2న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. డిసెంబరు 3న అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. డిసెంబరు 4న కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
ఇక, దక్షిణ కోస్తాంధ్రపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని... డిసెంబరు 3, 4 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తన బులెటిన్ లో స్పష్టం చేసింది.
డిసెంబరు 5న ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో డిసెంబరు 3,4 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని... అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
డిసెంబరు 2 సాయంత్రం నుంచి కోస్తాంధ్రలో బలమైన గాలులు వీస్తాయని వివరించింది. కాగా, తుపానుగా మారితే దాన్ని 'మిచౌంగ్' అని పిలుస్తారు. ఈ పేరును మయన్మార్ సూచించింది. మిచౌంగ్ అంటే 'శక్తిమంతుడు' అని అర్థం.