జ‌గ‌న్ ఏపీ జ‌నం ర‌క్తం పీల్చుతుంటే, ఆయ‌న అనుచ‌రులు అమెరికాలో ఏపీ యువ‌త‌పై శాడిజం చూపిస్తున్నారు: నారా లోకేశ్

  • అమెరికాలో ఒక విద్యార్థిపై ముగ్గురు వ్యక్తుల రాక్షసత్వం
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు
  • వారిలో ఒకరు వైసీపీ నేత సత్తారు వెంకటేశ్ రెడ్డి అన్న లోకేశ్
అగ్రరాజ్యం అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ పరిధిలో ఒక విద్యార్థిపై ఏపీకి చెందిన సత్తారు వెంకటేశ్ రెడ్డి, నిఖిల్, శ్రవణ్ అనే ముగ్గురు వ్యక్తులు దారుణమైన హింసకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురుని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. బాధిత విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

అమెరికాలో ముగ్గురు ఏపీ వ్యక్తుల కిరాతకం.. విద్యార్థిని 7 నెలలుగా హింసిస్తూ రాక్షసానందం!

ఈ ఘటనపై టీడీపీ యువనేత నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. సైకో జగన్ ఆంధ్రప్రదేశ్ జనాల రక్తం పీల్చుతుంటే... ఆయన అనుచర పిల్ల సైకోలు ఏపీ యువతపై శాడిజం చూపిస్తున్నారని అన్నారు. ఏపీకి చెందిన 20 ఏళ్ల కుర్రాడికి బంగారు భవిష్యత్తును చూపించి, అమెరికాకు రప్పించి... అక్కడ కూడా తమ అధినేత జగన్ మాదిరే వైసీపీ నేత సత్తారు వెంకటేశ్ రెడ్డి సైకోయిజం చూపించాడని మండిపడ్డారు. ఆ కుర్రాడిని తన ఇంట్లో బంధించి, కొట్టి, చిత్రహింసలపాలు చేశాడని అన్నారు. ఏపీలో అయితే బాధిత యువకుడిపైనే రివర్స్ కేసు పెట్టి, సీఐడీతో దర్యాప్తు చేయించేవారని దుయ్యబట్టారు. అమెరికా ప్రభుత్వం ముందు వైసీపీ సైకోల ఆటలు సాగలేదని... పిల్ల సైకోలు చట్టానికి చిక్కారని అన్నారు.


More Telugu News