నయనతారకు రూ.3 కోట్ల ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చిన భర్త విఘ్నేశ్ శివన్
- బర్త్‌డే గిఫ్ట్‌గా లగ్జరీ కారు అందించిన విఘ్నేశ్
- ‘ఎక్స్’ వేదికగా కారు లోగోలను షేర్ చేసిన నయనతార
- నవంబర్ 18న 40వ పుట్టినరోజు జరుపుకున్న ముద్దుగుమ్మ
ప్రముఖ కథానాయిక నయనతారకు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ అందించాడు. ఏకంగా రూ.3 కోట్ల ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్-క్లాస్ లగ్జరీ కారును బహుమతిగా అందించాడు. ఈ విషయాన్ని నయనతార ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. అత్యంత మధురమైన పుట్టినరోజు గిఫ్ట్ అని పేర్కొంది. ‘ వెల్కమ్ హోం యూ బ్యూటీ’ అంటూ కారుకి స్వాగతం పలికింది. ‘‘అత్యంత మధురమైన గిఫ్ట్ అందించిన భర్త విఘ్నేశ్‌కు ధన్యవాదాలు. ఐ లవ్ యూ’’ అంటూ రాసుకొచ్చింది. కారు లోగో ఫొటోలను షేర్ చేసింది. కాగా నవంబర్ 18న నయనతార 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా విఘ్నేశ్ ఈ బహుమతిని అందించాడు.
బర్త్‌డే సందర్భంగా ‘‘ హ్యాపీ బర్త్‌డే నా బంగారం’’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా విఘ్నేశ్ శుభాకాంక్షలు తెలిపాడు. దంపతులతోపాటు ఇద్దరు పిల్లల ఫొటోను పంచుకున్నాడు. ఇదిలావుంచితే ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్-క్లాస్ ప్రారంభ ధర రూ.2.69 కోట్లు కాగా గరిష్ఠంగా రూ.3.4 కోట్ల వరకు ఉంది. ఈ లగ్జరీ కారు రెండు మోడల్స్‌లో లభిస్తోంది. బేస్ మోడల్ ఎస్580, టాప్ మోడల్ ఎస్680గా ఉన్నాయి.