న్యూజిలాండ్‌పై టెస్టులో రికార్డు సాధించిన బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో
- కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచిన హొస్సేన్
- ఈ ఘనత సాధించిన 32వ అంతర్జాతీయ క్రికెటర్‌గా గుర్తింపు
- తొలి 24 టెస్టుల్లో 5 సెంచరీలు పూర్తి చేసిన శాంటో
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ హొస్సేన్ శాంటో రికార్డు సృష్టించాడు. టెస్టు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని ఇప్పటివరకు 32 మంది క్రికెటర్లు సాధించగా తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా శాంటో నిలిచాడు. సిల్హెట్ వేదికగా న్యూజిలాండ్‌పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ సెంచరీతో శాంటో ఈ రికార్డు సాధించాడు. 192 బంతులు ఆడి 10 ఫోర్ల సాయంతో శాంటో శతకాన్ని నమోదు చేశాడు. దీంతో 24 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు కొట్టిన ఆటగాడిగా శాంటో మరో రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్ తరపున తొలి 5 సెంచరీల మైలురాయిని మోమినుల్ హక్ మొత్తం 26 మ్యాచ్‌ల్లో అందుకోగా శాంటో రెండు మ్యాచ్‌లు ముందుగానే ఈ రికార్డును అందుకున్నాడు.
సిల్హెట్‌లో న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు పట్టు బిగించడంతో, కెప్టెన్‌గా అరంగేట్రంలోనే సెంచరీ కొట్టిన తొలి బంగ్లాదేశ్ క్రికెట్‌గా నజ్ముల్ హొస్సేన్ శాంటో నిలిచాడు. అతను 26 మ్యాచ్‌లలో మోమినుల్ హక్ ప్రయత్నాన్ని ఓడించి 24 మ్యాచ్‌లలో ఐదు టెస్ట్ సెంచరీలు చేసిన బంగ్లాదేశీగా కూడా నిలిచాడు. కాగా సిల్హెట్ టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 212 పరుగులుగా ఉంది. క్రీజులో శాంటో(104), ముస్తిఫిజర్ రహీం(43) పరుగులతో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో లభించిన 86 పరుగుల ఆధిక్యంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది.