ఎన్నికల్లో బీజేపీ తన శక్తిమేరకు సమర్థవంతంగా పని చేసింది: కిషన్ రెడ్డి
- బీఆర్ఎస్ అనేక ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని విమర్శలు
- ఒత్తిడిలోనూ పార్టీ కార్యకర్తలు గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారన్న కిషన్ రెడ్డి
- కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు
- నాగార్జున సాగర్ వద్ద ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు డ్రామాలు ఆడాయని ఆగ్రహం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా సమర్థవంతంగా పని చేసిందని, శక్తిమేరకు పని చేశామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలు బీజేపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. పార్టీ కోసం మొక్కవోని ధైర్యంతో పని చేసిన కార్యకర్తలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ఆగడాలను బీజేపీ శ్రేణులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. బీఆర్ఎస్ గత వారం రోజులుగా అనేక ప్రాంతాల్లో భౌతిక దాడులకు పాల్పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎన్నికలకు ముందు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిందన్నారు. ఎప్పుడూ లేని విధంగా దీక్షా దివస్ అంటూ డ్రామాలు ఆడారన్నారు. దీక్షా దివస్ పేరుతో నిబంధనలు ఉల్లంఘించారన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించాయన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీ శ్రేణులపై దాడి చేశాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ చాలా సమర్థవంతంగా, మాకున్న శక్తిమేరకు పని చేశామని, మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావంతో ఉన్నామన్నారు. పోలింగ్ ఇంకా జరుగుతోందని, కాబట్టి పూర్తి సమాచారం రావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేశాయని ఆరోపించారు. యువత పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతుగా నిలిచిందన్నారు. నిన్న నాగార్జున సాగర్ వద్ద జరిగిన ఘటన సరికాదన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ డ్రామాలు ఆడినట్లుగా కనిపిస్తోందన్నారు.