కడప పెద్ద దర్గా ఉరుసులో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్

  • అమీన్ పీర్ దర్గా ఉత్సవాల్లో పాల్గొన్న జగన్
  • ప్రభుత్వం తరపున చాదర్ సమర్పించిన సీఎం
  • ఉరుసుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు కడపలో పర్యటించారు. కడపలోని పెద్ద దర్గా (అమీన్ పీర్ దర్గా) ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మజార్లకు ప్రభుత్వం తరపున చాదర్ సమర్పించారు. అనంతరం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. దీనికి ముందు ముఖ్యమంత్రి నంద్యాల జిల్లాలో పర్యటించారు. గాలేరు - నగరి ప్రాజెక్టులో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు.   

మరోవైపు ఉరుసు నాలుగో రోజైన ఈరోజు దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా అరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలో ఆయన శిష్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిన్న రాత్రి ముషాయిరా హాల్లో ప్రముఖ గాయకులతో ఖవ్వాలీ కచేరీ నిర్వహించారు. ఉరుసు ఉత్సవాలకు స్థానికులే కాకుండా బయటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.


More Telugu News