మరోసారి చంద్రబాబు, పురందేశ్వరిలపై విజయసాయి విమర్శలు
- అప్పట్లో సుబ్బరామిరెడ్డి ఇంటికి ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి భోజనానికి వెళ్లారన్న విజయసాయి
- టీడీపీని కాంగ్రెస్ లో కలిపేస్తున్నారంటూ చంద్రబాబు, పురందేశ్వరి ప్రచారం చేశారని వెల్లడి
- పీవీకి ఎన్టీఆర్ అనుకూలంగా మాట్లాడితేనే తట్టుకోలేకపోయారని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు.
అప్పట్లో కేవలం సుబ్బరామిరెడ్డి ఇంటికి ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి భోజనానికి వెళితేనే టీడీపీని కాంగ్రెస్ లో కలిపేస్తున్నారంటూ చంద్రబాబు, పురందేశ్వరి ప్రచారం చేశారని విజయసాయి వెల్లడించారు. తెలుగువాడన్న ఉద్దేశంతో పీవీ నరసింహారావుకు ఎన్టీఆర్ అనుకూలంగా మాట్లాడితే తట్టుకోలేకపోయారని తెలిపారు.
మరి ఇప్పుడు తెలంగాణలోనూ, ఏపీలోనూ కాంగ్రెస్ తో మీరిద్దరూ ఎలా అంటకాగుతున్నారు బాబు, చెల్లెమ్మా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ లో కలిసిపోయారా? అంటూ ప్రశ్నించారు. అంతకన్నా బంగాళాఖాతంలో కలపడం బెటర్ కదా! అంటూ విమర్శించారు.