అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయింది: దర్శకుడు విక్రమ్ కుమార్
- 'థ్యాంక్యూ' సినిమాను గురించి ప్రస్తావించిన విక్రమ్ కుమార్
- కరోనా టైములో ఆ కథ పుట్టిందని వెల్లడి
- ఆ సమయంలో అందరి ఆలోచన అదేనని వ్యాఖ్య
- రిలీజ్ సమయానికి మైండ్ సెట్ మారిందని వెల్లడి
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ హీరోగా చేసిన 'థ్యాంక్యూ' సినిమా, క్రితం ఏడాది జులైలో థియేటర్స్ కి వచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో, రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవికా గోర్ నటించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.
ఆ సినిమా ఫ్లాప్ కావడం గురించి తాజా ఇంటర్వ్యూలో విక్రమ్ కుమార్ ప్రస్తావించారు. కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో .. లాక్ డౌన్ నడుస్తున్న సమయంలో ఈ కథ పుట్టింది. ఆ రోజున ఉన్న పరిస్థితులను చూసుకుంటే, డబ్బు .. పేరు .. హోదా ఏవీ ఒక మనిషిని కాపాడలేవని అర్థమైంది. అందువలన అనుభూతి ప్రధానంగా .. కృతజ్ఞతతో బ్రతకాలని గ్రహించాను. అలా పుట్టిన ఆలోచనలో నుంచి ఆ సినిమా రూపుదిద్దుకుంది" అన్నారు.
"కరోనా సమయంలో చాలా మంది మైండ్ సెట్ మారిపోయింది. చాలామంది డబ్బు ప్రధానం కాదు అన్నట్టుగా, నా మాదిరిగానే ఆలోచించారు. జీవితం చాలా చిన్నది .. ఈ ప్రయాణంలో మనకి సహకరించినవారికి థ్యాంక్స్ చెప్పుకోవడంలో ఆనందం ఉందని భావించారు. అయితే ఈ సినిమా విడుదలయ్యే సమయానికి కరోనా ప్రభావం పూర్తిగా పోయింది .. ప్రజల మైండ్ సెట్ కూడా మారిపోయింది. అందువలన ఆ సినిమాలోని ఎమోషన్స్ కనెక్ట్ కాలేదు" అని చెప్పారు.