నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసిన ఏపీ అధికారులు.. ఉద్రిక్తత

  • తెలంగాణ ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు
  • ఆధార్ లో ఏపీ అడ్రస్ ఉన్న వాహనాలనే అనుమతిస్తున్న పోలీసులు
  • బోర్డర్ లో భారీగా మోహరించిన ఇరు రాష్ట్రాల పోలీసులు
తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాగర్ డ్యామ్ పై 13వ గేట్ వరకు ఏపీ పోలీసులు ముళ్ల కంచెలు వేసిన సంగతి తెలిసిందే. డ్యామ్ పై సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. మరోవైపు సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ అధికారులు కిందకు నీటిని విడుదల చేశారు. దాదాపు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు గేట్లను ఎత్తి వేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు తెలంగాణ నుంచి వస్తున్న వాహనాలను ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఏపీ అడ్రస్ ఉన్న ఆధార్ కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. ఇతర వాహనాలను వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.


More Telugu News