జపాన్ సముద్ర తీరంలో కుప్పకూలిన అమెరికా హెలికాప్టర్ విమానం ఓస్ప్రే.. ఒకరి మృతి

  • ప్రమాద సమయంలో ఆరుగురు సిబ్బంది.. ఒకరి మృతి
  • ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి జపాన్ కోస్ట్‌గార్డ్
  • కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
అమెరికాకు చెందిన హెలికాప్టర్ విమానం ఓస్ప్రే ఎయిర్‌క్రాఫ్ట్ జపాన్ సముద్ర తీరంలో కుప్పకూలింది. యకుషిమా ద్వీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఒకరు మరణించారు. మిగతా వారి సమాచారం లభ్యం కాలేదు.

మత్స్యకారుల ద్వారా ప్రమాదంపై సమాచారం అందుకున్న జపాన్ కోస్ట్‌గార్డ్ వెంటనే రంగంలోకి దిగింది. గల్లంతైన వారిలో ఒకరిని గుర్తించగా, మిగిలిన వారికోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అమెరికా సైనిక విభాగానికి చెందిన ఓస్ప్రేను ఇటు హెలికాప్టర్‌గాను, అటు విమానంగానూ ఉపయోగించుకోవచ్చు. ఓస్ప్రే ఎయిర్‌క్రాఫ్ట్‌లు 2012 నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు ప్రమాదాలకు గురికాగా, 19 మంది మృతి చెందారు.


More Telugu News