'దూత' కథను సినిమాగా చేయనిది అందుకే: చైతూ

  • అమెజాన్ ప్రైమ్ లో 'దూత' వెబ్ సిరీస్ 
  • రేపటి నుంచి జరగనున్న స్ట్రీమింగ్ 
  • ప్రమోషన్స్ లో బిజీగా నాగచైతన్య 
  • వెబ్ సిరీస్ ల దిశగా తండ్రి ఎంకరేజ్ చేశాడని వెల్లడి 
  • ఎక్కువ మందికి రీచ్ అవుతామన్న చైతూ  

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ చేశాడు. రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ప్రమోషన్స్ లో చైతూ బిజీగా ఉన్నాడు. తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ .. " నేను చేసిన ఫస్టు వెబ్ సిరీస్ ఇది. వెబ్ సిరీస్ లు కూడా చేయాలని నేను నిర్ణయించుకున్న సమయంలో ఈ ప్రాజెక్టు వచ్చింది" అని అన్నాడు. 

"విక్రమ్ కుమార్ గారు కథ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ తరహా కథలను ఆయన చాలా బాగా డీల్ చేస్తాడనే విషయం కూడా నాకు తెలుసు. అందుకే ఇక నేను రెండో ఆలోచన చేయలేదు. అలాగని చెప్పి సినిమాగా చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఈ ఫార్మేట్ సినిమాకి వర్కౌట్ కాదు. ఒక సినిమా నుంచి ఆడియన్స్ ఆశించే అంశాలు ఇందులో ఉండవు" అని అన్నాడు.  

" ఇప్పుడు చాలామంది స్టార్స్ వెబ్ సిరీస్ లు చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అందువలన నేను కూడా చేయాలనుకున్నాను. నాన్నగారితో చెబితే ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. ఫస్టు పోస్టర్ తోనే లుక్ పరంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా భాషల్లో .. చాలా దేశాల్లోకి ఈ సిరీస్ వెళుతోంది. ఇంత మైలేజ్ ఇచ్చే సిరీస్ చేయడం కంటే ఒక ఆర్టిస్ట్ కి ఏం కావాలి?" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 


More Telugu News