ఇది ఎమోషనల్ మూవీ కాదు: 'హాయ్ నాన్న' ఈవెంటులో నాని
- నాని హీరోగా రూపొందిన 'హాయ్ నాన్న'
- డిసెంబర్ 7వ తేదీన విడుదల
- నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్
- వైజాగ్ తో ప్రత్యేక అనుబంధముందన్న నాని
- ఇది ఏడిపించే సినిమా కాదని వెల్లడి
నాని హీరోగా శౌర్యువ్ 'హాయ్ నాన్న' సినిమాను రూపొందించాడు. వైరా ఎంటర్టెన్ మెంట్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నడుస్తుంది. నాని కూతురుగా బేబీ కియారా నటించింది. కథానాయికలుగా శ్రుతి హాసన్ . మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును వైజాగ్ లో నిర్వహించారు. ఈ వేదికపై నాని మాట్లాడుతూ .. " వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కనుక, నాకు వైజాగ్ అంటే ప్రత్యేకమైన అనుబంధం ఉందని అనుకుంటారు. కానీ వైజాగ్ అంటే నాకు ఫస్టు నుంచి ప్రత్యేకమే. ఎందుకంటే నేను ఏ జోనర్ లో ఏ సినిమా చేసినా బ్రహ్మాండంగా ఆడిన ప్లేస్ వైజాగ్ .. అందుకే నాకు వైజాగ్ స్పెషల్" అన్నాడు.
"వైజాగ్ లో సాయంత్రం కాగానే మీరంతా బీచ్ రోడ్ కి ఎలా వెళతారో, డిసెంబర్ 7వ తేదీన థియేటర్ కి కూడా అలానే వెళ్లాలి. 'హాయ్ నాన్న' అనేది ఎప్పటికీ మీ మనసులో నిలిచిపోతుందని నేను చెప్పగలను. ఇది ఎమోషనల్ మూవీ .. ఇక నాని ఏడిపించేస్తాడని మీరంతా అనుకుంటున్నారు కదా, ఇది ఆనందబాష్పాలు తెప్పించే సినిమా" అని చెప్పాడు.