హైద్రాబాద్‌లోని తమ పోలింగ్ కేంద్రం క్యూలో ఎందరున్నారో ఇంటి నుంచే చెక్ చేసుకోవచ్చు!
- నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కీలక చర్యలు
- జీహెచ్ఎంసీ వెబ్‌సైట్, యాప్ ద్వారా క్యూలైన్ వివరాలు
- పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు
మహానగరాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ విస్తృత కసరత్తు చేస్తోంది. పోలింగ్ కేంద్రాల్లో భారీ క్యూలైన్లకు తోడు , వసతులు లేకపోవడం వంటి కారణాలతో ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారని ఈసీ గుర్తించింది. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు ఓ ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. పోలింగ్ కేంద్రాల్లోని క్యూ లైన్లలో ఎంత మంది ఉన్నారో ఇంటి నుంచే తెలుసుకునే వీలు కల్పించింది.
https://ghmcbls.in/poll-queue-status వైబ్‌సైట్ ద్వారా క్యూలైన్లో ఎందరు ఉన్నారో, ఓటింగ్‌కు ఎంత సమయం పడుతుందో తెలుసుకుని తగిన సమయంలో ఓటేసి రావచ్చు. వెబ్‌సైట్‌లో ఓటర్లు తమ నియోజకవర్గాన్ని ఎంచుకుని, ఆపై తమ పోలింగ్ స్టేషన్‌ను ఎంచుకుంటే ఈ వివరాలు తెలుస్తాయి. ఓటర్లు PollQRoute ద్వారా కూడా ఈ వివరాలు తెలుసుకుని చకచకా ఓటేసీ రావచ్చని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేశామని కూడా ఆయన తెలిపారు.