'ఆడుదాం ఆంధ్రా' క్రీడల మస్కట్ 'కిట్టు'ను పరిచయం చేయడం ఆనందంగా ఉంది: సీఎం జగన్
- 'ఆడుదాం ఆంధ్రా' పేరిట క్రీడా పోటీలు నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం
- మస్కట్ గా కృష్ణజింక... 'కిట్టు' అని నామకరణం
- మస్కట్ ను ఆవిష్కరించిన సీఎం జగన్
ఏపీ ప్రభుత్వం 'ఆడుదాం ఆంధ్రా' పేరిట ప్రతిష్ఠాత్మక రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రీడలకు అధికారిక చిహ్నం (మస్కట్) గా కృష్ణజింక కిట్టును రూపొందించారు. ఈ మస్కట్ ను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ లో స్పందించారు. మన 'ఆడుదాం ఆంధ్రా' అధికారిక చిహ్నం 'కిట్టు'ను పరిచయం చేయడం నాకు చాలా ఆనందం ఉంది అని వెల్లడించారు. "ఈ రాష్ట్ర వ్యాప్త టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులు ఉన్నతస్థాయికి చేరుకుంటారని నేను నమ్ముతున్నాను... ప్రతి ఒక్కరూ ఈ రోజే రిజిస్టర్ చేసుకోండి" అని పిలుపునిచ్చారు.
ఏపీలో 'ఆడుదాం ఆంధ్రా' క్రీడా పోటీలు డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 వరకు జరగనున్నాయి. వివిధ క్రీడాంశాల్లో పోటీ పడే ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు డిసెంబరు 13 వరకు అవకాశం ఉంది.
ఏపీలో 'ఆడుదాం ఆంధ్రా' క్రీడా పోటీలు డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 వరకు జరగనున్నాయి. వివిధ క్రీడాంశాల్లో పోటీ పడే ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు డిసెంబరు 13 వరకు అవకాశం ఉంది.