భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 728 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 207 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతం వరకు లాభపడ్డ యాక్సిస్ బ్యాంక్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ వాటి ప్రభావం మన మార్కెట్లపై పడలేదు. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 728 పాయింట్లు లాభపడి 66,902కి ఎగబాకింది. నిఫ్టీ 207 పాయింట్లు పుంజుకుని 20,097కి పెరిగింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (3.92%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.38%), విప్రో (2.32%), టాటా మోటార్స్ (2.09%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.94%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-0.57%), టైటాన్ (-0.49%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.34%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.07%).