'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి 'రూల్స్ రంజన్'

'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి 'రూల్స్ రంజన్'
  • అక్టోబర్ 6న విడుదలైన 'రూల్స్ రంజన్'
  • కిరణ్ అబ్బవరం జోడీకట్టిన నేహా శెట్టి
  • థియేటర్స్ వైపు నుంచి తగ్గిన రెస్పాన్స్  
  • ఈ నెల 30 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్

'ఆహా' ఒక వైపున కొత్త వెబ్ సిరీస్ లతో .. టాక్ షోస్ తో .. సినిమాలతో తన జోరు చూపిస్తోంది. ఈ వారం 'ఆహా' మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'రూల్స్ రంజన్'. కిరణ్ అబ్బవరం - నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకి, రథినం కృష్ణ దర్శకత్వం వహించాడు. 

రొమాంటిక్ యాక్షన్ డ్రామా జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 30వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. థియేటర్స్ కి ఈ సినిమా అక్టోబర్ 6వ తేదీన వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేకపోయింది.

హీరో ముంబైలోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. కాలేజ్ రోజుల్లో అతను ప్రేమించిన అమ్మాయి, హఠాత్తుగా అతని జీవితంలోకి ఎంటరవుతుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేదే కథ. అమ్రిశ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్ ... హైపర్ ఆది ముఖ్యమైన పాత్రలను పోషించారు.


More Telugu News