మీ ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో ఇలా తెలుసుకోండి...!
- ఇప్పటికే స్లిప్పులు పంపిణీ చేసిన ఎన్నికల సంఘం
- స్లిప్పులు రానివాళ్లు వివిధ మార్గాలలో పోలింగ్ కేంద్రం తెలుసుకోవచ్చు
- టోల్ ఫ్రీ నెంబర్ 1950కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం స్లిప్పులను పంపిణీ చేసింది. అయితే వివిధ కారణాల వల్ల కొంతమందికి అందకపోయి ఉండవచ్చు. అయితే స్లిప్ లేనంత మాత్రాన ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్ ద్వారా మీరు మీ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వివరాలను చూసుకోవచ్చు.
మీ వద్ద ఓటరు కార్డు ఉంటే ఆ నెంబర్‌ను 1950, 9211728082 నెంబర్లకు పంపిస్తే మీ పోలింగ్ కేంద్రం వివరాలు ఎస్సెమ్మెస్ రూపంలో మీకు లభిస్తాయి. ఇరవై నాలుగు గంటల పాటు పని చేసే టోల్ ఫ్రీ నెంబర్ 1950కి ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ సాయంతో పోలింగ్ కేంద్రం, బూత్ నెంబర్, క్రమసంఖ్య వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
ఎన్నికల సంఘానికి చెందిన ఓటర్ హెల్ప్ లైన్, యాప్ డౌన్ లోడ్ చేసుకొని కూడా వివరాలు పొందవచ్చు. ఎన్నికల సంఘం వెబ్ సైట్ https://electoralsearch.eci.gov.in/ ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లోని ఆస్క్ వోటర్ సహ్య మిత్ర చాట్ బాట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు వివరాలు, ఎపిక్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్ ఆధారంగా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు.