ఇసుకలో జగన్ వేల కోట్లు దోచేశాడు: దేవినేని ఉమ
- సామాన్యులకు ఇసుకను అందుబాటులో లేకుండా చేశాడని దేవినేని విమర్శ
- ఇసుక టెండర్ సొమ్ములో సగం మాయమయిందని ఆరోపణ
- ఖజానాకు రావాల్సిన వందల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్న
సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్ ఇసుకలో వేల కోట్లు దోచేశాడని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఇసుక టెండర్ సొమ్ములో సగం మాయమయిందని అన్నారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన వందల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఇసుక కాంట్రాక్ట్ గడువు మే నెలతోనే పూర్తయిందని చెప్పారు. ఆరు నెలలుగా ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ్ముడి కోసం కోల్ కతా కేంద్రంగా రహస్య తతంగం నడుస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన వందల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు.