ఉత్కంఠను పెంచుతున్న 'దూత' సిరీస్ .. కీలకమైన అంశం ఇదే!
- విక్రమ్ కుమార్ నుంచి 'దూత'
- వరుస హత్యల చుట్టూ తిరిగే కథ
- జర్నలిస్టు పాత్రలో కనిపించనున్న చైతూ
- ఐదు భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
నాగచైతన్య హీరోగా 'దూత' వెబ్ సిరీస్ రూపొందింది. తన కెరియర్లో ఆయన చేసిన ఫస్టు వెబ్ సిరీస్ ఇదే. శరత్ మరార్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సిరీస్ కి, విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ నుంచి అప్ డేట్స్ వదులుతున్న దగ్గర నుంచి అందరిలో మరింతగా ఆసక్తి పెరుగుతూ పోతోంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఐదు భాషల్లో 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్ కంటెంట్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సాగర్ అనే జర్నలిస్టుగా చైతూ కనిపించనున్నాడు. ఆయన 'సమాచార్' అనే దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటాడు. నగరంలో జరుగుతున్న వరుస హత్యలకు సంబంధించిన ఒక 'క్లూ' అతనికి దొరుకుతుంది. దాంతో ఆ మిస్టరీని ఛేదించడానికి ఒక జర్నలిస్టుగా రంగంలోకి దిగుతాడు.
అయితే కొన్ని అనూహ్యమైన పరిణామాల వలన అతనే నేరస్థుడిగా నిలబడిపోవలసి వస్తుంది. అతను అలా చిక్కుల్లో పడటానికి కారకులు ఎవరు? ఆ చిక్కుల్లో నుంచి అతను ఎలా బయటపడతాడు? అనే అంశాలే ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రియా భవాని శంకర్ .. పార్వతీ తిరువోతు .. ప్రాచీ దేశాయ్ .. తరుణ్ భాస్కర్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.