డిసెంబరు 3న అతి భారీ వర్షాలు... రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్
- ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
- డిసెంబరు 4 నాటికి తుపాను
- రాయలసీమలో 204 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న ఐఎండీ
- కోస్తాంధ్రలో డిసెంబరు 2 నుంచి 4 వరకు విస్తారంగా వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది నవంబరు 30 నాటికి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం, డిసెంబరు 2 కల్లా నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తుపానుగా బలపడుతుందని ఐఎండీ వివరించింది.
దీని ప్రభావంతో డిసెంబరు 3న రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ మేరకు రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్ఠంగా 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
కోస్తాంధ్రలో డిసెంబరు 2 నుంచి 4 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నవంబరు 30 కల్లా తిరిగొచ్చేయాలని ఐఎండీ హెచ్చరించింది.