ఓటర్ ఐడీ కార్డు లేకపోతే ఇలా చేయండి..!
- ఈసీ సూచించిన గుర్తింపు కార్డులతో ఓటు వేసే అవకాశం
- పోల్ స్లిప్ లేని వారు బీఎల్‌ఓలను సంప్రదించి స్లిప్ తీసుకోవచ్చు
- ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులతో ఓటు వేసే అవకాశం
ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరి. అయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ సూచించిన ఇతర గుర్తింపు కార్డులతోనూ ఓటు వేయచ్చు.
పోల్ చిటీలు లేని వారికి గుర్తింపు కార్డు ఉన్నా సరిపోతుంది. ముందుగా కేంద్రం వద్ద ఉన్న బీఎల్ఓ వద్దకు వెళ్లాలి, వారు ఓటరు జాబితాలో సరి చూసి ఓ చిటీపై క్రమసంఖ్య, పేరు రాసి ఇస్తారు. గతంలో ఎక్కడ ఓటేశారో అక్కడికి వెళ్లి బీఎల్‌ఓను కలవాలి. ఓటేసేందుకు పౌరులు, ఫొటో ఓటరు స్లిప్పు, ఫొటో గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకులు పోస్టాఫీసులు జారీ చేసే పాస్‌పుస్తకం(ఫొటోతో ఉన్నవి), పాన్ కార్డు సాయంతో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్ కార్డు, ఎంఎన్ఆర్‌జీఏ జాబ్ కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, ఫొటో ఉన్న పింఛను పత్రాలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రాలతో ఓటు వేయచ్చు.