టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు బీసీసీఐ ఆఫర్!
- కాంట్రాక్ట్ పొడిగింపునకు బీసీసీఐ మరోసారి సంప్రదించినట్టుగా రిపోర్టులు
- ప్రస్తుతానికి ద్రావిడ్ నుంచి స్పందన రాలేదని సమాచారం
- ద్రావిడ్ సుముఖత వ్యక్తం చేయకపోతే వీవీఎస్ లక్ష్మణ్‌కే అవకాశం!
టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం వరల్డ్ కప్ 2023తో ముగిసిపోవడంతో తదుపరి ఈ బాధ్యతలు చేపట్టబోయేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. పొడిగింపునకు ద్రావిడ్ సుముఖంగా లేకపోవడంతో కొత్త కోచ్‌ను తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే తాజాగా మరోసారి ద్రావిడ్‌ను బీసీసీఐ సంప్రదించినట్టు తెలుస్తోంది. కోచ్ కాంట్రాక్ట్ పొడిగింపు ఆఫర్‌ను ఇచ్చినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ద్రావిడ్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
జట్టు కోసం ద్రావిడ్ ఏర్పాటు చేసిన విధానాన్ని కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తాజాగా మరోసారి సంప్రదించినట్టు ‘ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో’ రిపోర్ట్ పేర్కొంది. అయితే ద్రావిడ్ ఇంకా స్పందించలేదని తెలిపింది. ఒకవేళ ద్రావిడ్ నుంచి సానుకూల స్పందన లేకుంటే ప్రస్తుతం ఎన్‌సీఏ (నేషనల్ క్రికెట్ అకాడమీ) చీఫ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరి కోసం బీసీసీఐ కాంట్రాక్ట్ పత్రాలను సిద్ధం చేసిందని మరొక రిపోర్ట్ పేర్కొంది. కాగా ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియాతో ఉన్నాడు. కాంట్రాక్ట్ పొడిగింపునకు రాహుల్ ద్రావిడ్ అంగీకరించకపోతే లక్ష్మణ్ ప్రధాన పోటీదారుగా ఉంటాడు.