తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి నుంచి మంత్రి వేణుగోపాలకృష్ణ డిశ్చార్జి

  • నిన్న ఛాతీలో నొప్పితో బాధపడిన మంత్రి వేణుగోపాలకృష్ణ
  • తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స
  • యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు
  • మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన నిన్న అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఛాతీలో నొప్పితో బాధపడిన మంత్రిని మొదట విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ్నించి మెరుగైన చికిత్స కోసం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మణిపాల్ ఆసుపత్రి వైద్యులు మంత్రి వేణుగోపాలకృష్ణను 24 గంటల పరిశీలనలో ఉంచారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ సాయంత్రం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.


More Telugu News