ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీలకు ప్రజలు గుర్తుకు వస్తారు: మంత్రి మల్లారెడ్డి
- అభివృద్ధిని చూసి మరోసారి తనను ఆశీర్వదించాలన్న మల్లారెడ్డి
- రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారన్న మంత్రి
- కాంగ్రెస్, బీజేపీల మాయమాటలు నమ్మవద్దని కోరిన మల్లారెడ్డి
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఘట్‌కేసర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అభివృద్ధిని చూసి మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. ఇప్పటి వరకు ప్రజలు ఆశించిన అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకు పోతున్నారని పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజలను ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు అభివృద్ధి పట్టదన్నారు. అందుకే ఆ పార్టీల మాయమాటలు నమ్మవద్దన్నారు. తనకు మరోసారి అవకాశం కల్పిస్తే ఘట్‌కేసర్ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.