మీరు నా మనసులో ఉన్నారు: తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం
- ప్రియమైన సోదర... సోదరీమణులారా... నమస్కారం అంటూ సోనియా ప్రసంగం
- దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణ రావాలని పిలుపు
- మార్పు రావాలి... కాంగ్రెస్ రావాలన్న సోనియాగాంధీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ మంగళవారం ప్రజలకు ఓ సందేశం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క తదితర కాంగ్రెస్ నేతలు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రియమైన తెలంగాణ సోదర.. సోదరీమణులారా.. నమస్కారం అంటూ సోనియాగాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నేను మీ వద్దకు రాలేకపోతున్నాను.. కానీ మీరంతా నా మనసులో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రజల తెలంగాణగా మార్చుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నారు. సోనియమ్మ అంటూ తనపై ఎంతో ప్రేమ చూపించారని, మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మీ ప్రేమకు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలినన్నారు. మార్పు రావాలి... కాంగ్రెస్ రావాలన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సందేశమిచ్చారు.
'2000 సంవత్సరంలో తెలంగాణ డిమాండ్ వెనక్కి తీసుకోమని సోనియాగాంధీ చెప్పారు' అన్న వార్తను.. అలాగే 2014లో 'ఏపీ విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం', 'తెలంగాణ బిల్లు ఆమోదం వెనుక సోనియాగాంధీ' అంటూ వచ్చిన వార్తా క్లిప్పింగ్స్‌ను వీడియోలో పొందుపరిచారు. దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ అంటూ తెలుగులో మాట్లాడారు... దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకుందామని పిలుపునిచ్చారు.