పండుగ సీజన్లో వాహన విక్రయాల జోరు

  • భారత్ లో దసరా, దీపావళి వేళ కొనుగోళ్ల ఊపు
  • ఇటీవలే ముగిసిన పండుగ సీజన్
  • గతేడాదితో పోల్చితే ఈ పండుగ సీజన్ లో అమ్మకాల వృద్ధి 19 శాతం
భారత్ లో దసరా, దీపావళి పండుగలకు కొత్త వస్తువులు, వాహనాలు, బంగారం కొనడం సంప్రదాయం. ఇటీవలే భారత్ లో పండుగ సీజన్ ముగిసింది. ఈసారి పండుగ సీజన్లో వాహన విక్రయాల్లో పెరుగుదల కనిపించింది.

గతేడాది ఇదే సీజన్ తో పోల్చితే ఈసారి 19 శాతం అధికంగా వాహనాల కొనుగోళ్లు నమోదయ్యాయి. 2022లో 31,95,213 వాహనాల అమ్మకాలు జరగ్గా... ఈ ఏడాది 37,93,584 వాహనాలు అమ్ముడయ్యాయి. నవరాత్రుల వేళ అమ్మకాలు ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ, దీపావళి సమయంలో మాత్రం జోరు ప్రదర్శించినట్టు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) వెల్లడించింది. 

అయితే, ఇతర వాహనాలతో పోల్చితే ట్రాక్టర్ల అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల కనిపించినట్టు ఫాడా పేర్కొంది. గతేడాది 86,951 ట్రాక్టర్ల కొనుగోళ్లు నమోదు కాగా, ఈసారి 86,572 ట్రాక్టర్లే అమ్ముడయ్యాయి.  పండుగ సీజన్ లో అత్యధికంగా అమ్ముడైంది ఎస్ యూవీలేనని ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా వివరించారు.


More Telugu News