చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీల్లో పాల్గొనవచ్చు: సుప్రీంకోర్టు

  • చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంలో సీఐడీ పిటిషన్
  • డిసెంబర్ 8 లోపు కౌంటర్ దాఖలు చేయాలని బాబుకు సుప్రీం నోటీసులు
  • తదుపరి విచారణ డిసెంబర్ 8కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఊరటను కల్పించింది. రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని సుప్రీం ధర్మాసనం తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టులో సీఐడీ సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. డిసెంబర్ 8వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాల గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడొద్దని చంద్రబాబుకు సూచించింది. స్కిల్ కేసుపై ప్రభుత్వం తరపున కూడా ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.


More Telugu News