శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా బండారు శ్రావణి నియామకం వార్త.. వైరల్ లెటర్‌హెడ్‌పై దేవినేని వివరణ
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెటర్‌హెడ్
- ఫేక్ అని కొట్టిపారేసిన దేవినేని
- ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని కార్యకర్తలు, ప్రజలకు సూచన
- ఇది పేటీఎం బ్యాచ్ కుట్రేనన్న టీడీపీ సీనియర్ నేత
అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గానికి బండారు శ్రావణిని టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమించినట్టు జరుగుతున్న ప్రచారంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. ‘శింగనమల నియోజకవర్గానికి ఇంచార్జ్ నియామకం’ అని రాసివున్న టీడీపీ లెటర్‌హెడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవంబరు 27వ తేదీన ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు జారీచేసినట్టుగా ఉంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ లెటర్‌హెడ్‌పై దేవినేని ఉమా తన ఎక్స్ ఖాతా ద్వారా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని కార్యకర్తలు, ప్రజలకు సూచించారు. ఇది జగన్‌రెడ్డి పేటీఎం బ్యాచ్ చేస్తున్న కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వైసీపీ ఫేక్ బ్రతుకు, వై ఏపీ హేట్స్ జగన్ అని హ్యాష్‌ట్యాగ్స్ తగిలించారు.