తన డీప్ ఫేక్ వీడియోపై రష్మిక మందన్న స్పందన
- తన ఫేక్ వీడియోను చూసి తొలుత బాధపడ్డానన్న రష్మిక
- ఆ తర్వాత దీన్ని సాధారణంగా తీసుకోకూడదని అనుకున్నానని వెల్లడి
- ఏదైనా ఘటన బాధిస్తే మౌనంగా ఉండొద్దని అమ్మాయిలకు సూచన
సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న, కాజోల్, అలియా భట్ లు ఈ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. తాజాగా ఈ అంశంపై రష్మిక మందన్న స్పందిస్తూ... ఫేక్ వీడియోలు సృష్టించడం ఈ రోజుల్లో సాధారణమైపోయిందని చెప్పారు. ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు మనం కచ్చితంగా స్పందించాలని అన్నారు. తన ఫేక్ వీడియోను చూసి తొలుత తాను బాధపడ్డానని.. ఏం చేయగలమని అనిపించిందని చెప్పారు. ఆ తర్వాత దీన్ని సాధారణంగా తీసుకోకూడదని అనుకున్నానని... అందుకే దీనిపై స్పందించానని తెలిపారు.
ఏదైనా ఘటన మిమ్మల్ని బాధిస్తే మీరు మౌనంగా ఉండొద్దంటూ అమ్మాయిలకి రష్మిక సూచించారు. మౌనంగా ఉండొద్దని, దానిపై స్పందిస్తే మీకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని చెప్పారు. తొలుత తనకు అమితాబ్ బచ్చన్ నుంచి సపోర్ట్ లభించిందని... ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన చాలా మంది మద్దతు తెలిపారని వెల్లడించారు. యాక్టర్లు, క్రికెటర్లపై మీమ్స్, ట్రోల్స్ సాధారణమని... అలాంటి వాటిని పట్టించుకోవద్దని చెప్పారు.