రష్యా ఆక్రమిత క్రిమియా ప్రాంతంపై తుపాను పంజా... ఉక్రెయిన్ లోనూ అంధకారం
- నల్ల సముద్రంలో పెను తుపాను
- క్రిమియాపై విరుచుకుపడిన వైనం
- 20 లక్షల మందిపై తుపాను ప్రభావం
- గంటకు 144 కి.మీ వేగంతో గాలులు
- ఉక్రెయిన్ లో 2 వేల పట్టణాల్లో నిలిచిపోయిన విద్యుత్
రష్యా ఆక్రమిత ప్రాంతం క్రిమియాపై తుపాను విరుచుకుపడింది. నల్ల సముద్రంలో ఏర్పడిన పెను తుపాను క్రిమియాను అతలాకుతలం చేసింది. 20 లక్షల మందిపై తుపాను ప్రభావం పడింది. నలుగురు మృతి చెందగా, భారీగా ఆస్తినష్టం సంభవించింది. రష్యా దక్షిణ భాగంలోని సోచీలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
తుపాను కారణంగా గంటకు 144 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీయడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దాంతో చాలా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. గత 16 ఏళ్లలో ఇంతటి తీవ్రమైన తుపాను ఎప్పుడూ రాలేదని అధికార వర్గాలు అంటున్నాయి. సెవస్తపోల్ లో ఉన్న అరుదైన జలచరాలతో కూడిన ఆక్వేరియం తుపాను ధాటికి ధ్వంసమైంది. దాంతో, ఎన్నో అరుదైన చేపలు మృత్యువాతపడ్డాయి.
అటు, ఉక్రెయిన్ కూడా ఈ తుపాను ప్రభావానికి గురైంది. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో ఉక్రెయిన్ లో 2 వేల పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి.