వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
  • నవంబర్ 1న ఇటలీలో లావణ్య, వరుణ్ ల పెళ్లి
  • ప్రేమతో రెండు హృదయాలు ఒక్కటయ్యాయన్న చిరంజీవి
  • ఒక అందమైన క్షణాన్ని మీతో పంచుకుంటున్నానన్న చిరు
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరు... ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం ఇరు కుటుంబాల సభ్యులు, కొందరు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. అనంతరం నవంబర్ 5న హైదరాబాద్ లో వీరు గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చారు.

మరోవైపు వీరి వివాహానికి సంబంధించిన ఒక ఫొటోను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇటలీలో ఒక అందమైన సాయంత్రం. చాలా కాలం క్రితం జరిగింది కాదు. ప్రేమతో ఒకటైన రెండు హృదయాలు.. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను తీసుకొచ్చాయి. అలాంటి అందమైన క్షణాన్ని మీతో పంచుకుంటున్నాను' అని చిరంజీవి పేర్కొన్నారు. 


More Telugu News