బ్యాట్‌పై పాలస్తీనా జెండాను ప్రదర్శించిన పాక్ క్రికెటర్.. మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా

  • కరాచీలో జరుగుతున్న నేషనల్ టీ20 కప్‌లో ఘటన
  • రిఫరీ హెచ్చరించినా పట్టించుకోని ఆజంఖాన్
  • గత రెండు మ్యాచుల్లోనూ అదే పనిచేసిన క్రికెటర్
పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజంఖాన్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. కరాచీలో జరుగుతున్న నేషనల్ టీ20 కప్‌లో క్లాథింగ్, ఎక్విప్‌మెంట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను పీసీబీ ఈ జరిమానా విధించింది. ఆజం తన బ్యాట్‌పై పాలస్తీనా జెండాను ప్రదర్శించడమే ఇందుకు కారణం. కరాచీ వైట్స్-లాహోర్ బ్లూస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు జరిమానా విధించడంపై ఆజంఖాన్ వివరణ ఇస్తూ.. తన బ్యాట్లు అన్నింటిపైనా అలాంటి స్టిక్కర్లే ఉంటాయని అధికారులకు తెలిపాడు. 

మ్యాచ్ ఫీజులో కోత విధించడానికి ముందే బ్యాట్‌పై అలాంటి ప్రదర్శన చేయొద్దని, అది ఐసీసీ ఆమోదించని లోగో (పాలస్తానా జెండా) అని ఆజంను రిఫరీ హెచ్చరించాడు. ఈ మ్యాచే కాదు.. ఇంతకుముందటి రెండు మ్యాచుల్లోనూ అదే స్టిక్కర్‌ను ఆజం ఉపయోగించినట్టు తెలుస్తోంది. అయితే, అప్పుడు మాత్రం అతడికి అధికారుల నుంచి ఎలాంటి హెచ్చరికలు రాలేదు. ఐసీసీ నిబంధనల క్లాథింగ్, ఎక్విప్‌మెంట్ రెగ్యులేషన్ ప్రకారం.. ఆటగాళ్లు రాజకీయ, మతపరమైన, జాతి వివక్షకు సంబంధించిన కార్యకలాపాలు, కారణాలను ప్రదర్శించడం నిషిద్ధం.


More Telugu News