పులివెందుల టీడీపీ ఇన్ఛార్జీ బీటెక్ రవిని కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

  • ఈ నెల 14న బీటెక్ రవిని అరెస్ట్ చేసిన వల్లూరు పోలీసులు
  • కడప ఎయిర్ పోర్టు వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారంటూ కేసు
  • జనవరి 25న లోకేశ్ రాక సందర్భంగా ఘటన
మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ బీటెక్ రవిని కడప కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. ఆయన రిమాండ్ గడువు ముగియడంతో కోర్టుకు తీసుకువచ్చారు. ఈ నెల 14న బీటెక్ రవిని వల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బీటెక్ రవి అరెస్ట్ వివరాల్లోకి వెళ్తే... నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఆ సందర్భంగా లోకేశ్ కు స్వాగతం పలికేందుకు బీటెక్ రవి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. విమానాశ్రయంలోకి వెళ్లడానికి ఆయన ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


More Telugu News