తను డ్యాన్స్ ఎందుకు మానేశాడో చెప్పిన నటుడు మనోజ్ బాజ్‌పాయ్
- ఢిల్లీలో ఓ వేడుకకు హాజరైన మనోజ్ బాజ్‌పాయ్
- పాత జ్ఞాపకాల్ని ప్రేక్షకులతో పంచుకున్న వైనం
- హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ అద్భుత డ్యాన్సర్లని కితాబు
- హృతిక్ డ్యాన్స్ చూశాక తాను డ్యాన్స్ చేయడం విరమించుకున్నానని వ్యాఖ్య
నాటి ‘సత్య’ నుంచి నేటి ‘ఫ్యామిలీ మ్యాన్’ వరకూ తన నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మనోజ్ బాజ్‌పాయ్. ఏ పాత్రలోనైనా ఒదిగిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెరపై ఎంతటి సీరియస్ పాత్రలు చేస్తారో రియల్ లైఫ్‌లో అంతే సరదాగా ఉంటారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మనోజ్..తను డ్యాన్స్ ఎందుకు మానేయాల్సి వచ్చిందో చెబుతూ అక్కడి వారిని కడుపుబ్బా నవ్వించారు.
‘‘కెరీర్ ప్రారంభంలో నేను డ్యాన్స్ చేసేవాడిని, అయితే, ‘కహో నా ప్యార్ హై’లో హృతిక్ రోషన్ చేసిన డ్యాన్స్‌కు అబ్బురపడ్డా. డ్యాన్స్ అంటే ఇలా ఉండాలని అనుకుని నేను చేయడం మానేశా. ఆ తరువాత కొన్నాళ్లకు టైగర్ ష్రాఫ్ తెరంగేట్రం చేశాడు. అతడూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. నేను సాధారణ వ్యక్తిని కాబట్టి సాధారణంగానే డ్యాన్స్ చేస్తా. సత్య చిత్రంలోని నా డ్యాన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. వారూ అలానే డ్యాన్స్ చేసి ఆనందించారు’’ అని మనోజ్ నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు.