వీసా లేకుండానే భారతీయ పర్యాటకులకు మలేసియా ఎంట్రీ
- డిసెంబర్ 3 నుంచి మొదలుకానున్న ఆఫర్
- 30 రోజులపాటు అక్కడ గడిపేందుకు ఛాన్స్
- భారత్‌తోపాటు చైనా పౌరులకు కూడా ఆఫర్
- విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే మలేసియా లక్ష్యం
విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మలేసియా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పించింది. చైనా పౌరులకు కూడా ఈ ఆఫర్ కల్పించింది. డిసెంబర్ 1 నుంచి భారతీయులు, చైనీయులు వీసా లేకుండానే తమ దేశానికి రావొచ్చని మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. 30 రోజులపాటు దేశంలో గడపొచ్చని వివరించారు. ఈ మేరకు ఆదివారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వివరాలు చెప్పారు. భద్రతకు సంబంధించిన స్క్రీనింగ్ మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.
విదేశీ పర్యాటకులు, ఇన్వెస్టర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా వీసాతో ముడిపడిన ప్రక్రియను సులభతరం చేయాలని యోచిస్తున్నట్టు గత నెలలోనే ప్రధాని అన్వర్ పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్, చైనా దేశాల పర్యాటకులకు ఈ సౌకర్యాలను కల్పించనున్నట్టు చెప్పారు. దేశంలోకి పర్యాటకుల సంఖ్య పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇస్తుందని మలేసియా ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి.