ఐపీఎల్-2024: అన్ని ఫ్రాంచైజీల రిటెన్షన్-రిలీజ్ పూర్తి వివరాలు ఇవిగో!
- మరి కొన్ని నెలల్లో ఐపీఎల్ తాజా సీజన్
- ఆటగాళ్ల విడుదల, అట్టిపెట్టుకోవడానికి నేటితో ముగిసిన గడువు
- పలువురు ఆటగాళ్లను విడుదల చేసిన ఫ్రాంచైజీలు
- డిసెంబరు 19న దుబాయ్ లో ఆటగాళ్ల వేలం
ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిలీజ్ చేసేందుకు, రిటైన్ చేసుకునేందుకు నేటితో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో, మొత్తం 10 ఫ్రాంచైజీలు తాము విడుదల చేస్తున్న, అట్టిపెట్టుకుంటున్న ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. గుదిబండల్లా మారిన ఆటగాళ్లను వదిలించుకోవడంతో పాటు, గెలుపు గుర్రాలు అనదగ్గ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు నిలుపుకున్నాయి. కాగా, విడుదల చేసిన ఆటగాళ్లను ఈ నెల 19న దుబాయ్ లో నిర్వహించే వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే వీలుంటుంది.
ఏ జట్టు ఎవరిని విడుదల చేసింది... ఎవరిని అట్టిపెట్టుకుందంటే...
చెన్నై సూపర్ కింగ్స్...
విడుదల చేసిన ఆటగాళ్లు: బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుభ్రాంశు సేనాపతి, ఆకాశ్ సింగ్, కైల్ జేమీసన్, సిసాందా మగాలా.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, మొయిన్ అలీ, శివం దూబే, నిశాంత్ సంధు, అజయ్ మండల్, రాజ్యవర్ధన్ హంగార్గేకర్, దీపక్ చహర్, మహీశ్ తీక్షణ, ముఖేశ్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సిమర్జిత్ సింగ్, తుషార్ దేశ్ పాండే, మతీశ పతిరణ.
గుజరాత్ టైటాన్స్...
విడుదల చేసిన ఆటగాళ్లు: యశ్ దయాళ్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సంగ్వాన్, ఒడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, దసున్ షనక.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, శుభ్ మాన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి.సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిశోర్, రషీద్ ఖాన్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ.
విడుదల చేసిన ఆటగాళ్లు: హ్యారీ బ్రూక్, సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకీల్ హోసీన్, అదిల్ రషీద్.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: ఐడెన్ మార్ క్రమ్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కో యన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజల్ హక్ ఫరూఖీ.
సన్ రైజర్స్ జట్టు షాబాజ్ అహ్మద్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి తీసుకుంది.
విడుదల చేసిన ఆటగాళ్లు: రిలీ రూసో, చేతన్ సకారియా, రోవ్ మాన్ పావెల్, మనీశ్ పాండే, ఫిల్ సాల్ట్, ముస్తాఫిజూర్ రెహ్మాన్, కమలేశ్ నాగర్ కోటి, రిపల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్, ప్రియమ్ గార్గ్.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, యశ్ ధూల్, ప్రవీణ్ దూబే, వికీ ఓస్త్వాల్, ఆన్రిచ్ నోక్యా, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎంగిడి, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేశ్ కుమార్.
రాజస్థాన్ రాయల్స్...
విడుదల చేసిన ఆటగాళ్లు: జో రూట్, అబ్దుల్ బాసిత్, జాసన్ హోల్డర్, ఆకాశ్ వశిష్ట్, కుల్దీప్ యాదవ్, ఒబెద్ మెకాయ్, మురుగన్ అశ్విన్, కేసీ కరియప్ప, కేఎం ఆసిఫ్.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రోన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ పోరెల్, రియాన్ పరాగ్, డోనోవాన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చహల్, ఆడమ్ జంపా.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆవేశ్ ఖాన్ ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తీసుకుంది.
కోల్ కతా నైట్ రైడర్స్...
విడుదల చేసిన ఆటగాళ్లు: షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, ఆర్య దేశాయ్, డేవిడ్ వీస్, నారాయణ్ జగదీశన్, మన్ దీప్ సింగ్, కుల్వంత్ ఖేజ్రోలియా, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గుసన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, జాన్సన్ చార్లెస్.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: నితీశ్ రాణా, రింకూ సింగ్, రహ్మనుల్లా గుర్బాజ్, శ్రేయాస్ అయ్యర్, జాసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాశ్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
లక్నో సూపర్ జెయింట్స్...
విడుదల చేసిన ఆటగాళ్లు: జయదేవ్ ఉనద్కట్, డేనియల్ సామ్స్, మన్నన్ వోరా, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, అర్పిత్ గులేరియా, సూర్యాన్ష్ షెగ్డే, కరుణ్ నాయర్.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, నికోలాస్ పూరన్, ఆయుష్ బదోనీ, కైల్ మేయర్స్, మార్కస్ స్టొయినిస్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, నవీనుల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్ వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, మార్క్ ఉడ్, మయాంక్ యాదవ్, మొహిసిన్ ఖాన్.
లక్నో జట్టు దేవదత్ పడిక్కల్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి తీసుకుంది.
ముంబయి ఇండియన్స్...
విడుదల చేసిన ఆటగాళ్లు: మహ్మద్ అర్షద్ ఖాన్, రమణ్ దీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టాన్ స్టబ్స్, డువాన్ యన్సెన్, జే రిచర్డ్సన్, రిలే మెరిడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), డివాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, కామెరాన్ గ్రీన్, శామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జాసన్ బెహ్రెండార్ఫ్.
ముంబయి జట్టు రొమారియో షెపర్డ్ ను లక్నో జట్టు నుంచి తీసుకుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు...
విడుదల చేసిన ఆటగాళ్లు: వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజెల్ వుడ్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోను యాదవ్, అవినాశ్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్ వెల్, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లొమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ బందగీ, వైశాఖ్ విజయ్ కుమార్, అకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లే, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్.
బెంగళూరు జట్టు మయాంక్ దాగర్ ను సన్ రైజర్స్ నుంచి తీసుకుంది.
పంజాబ్ కింగ్స్...
విడుదల చేసిన ఆటగాళ్లు: మోహిత్ రాఠీ, రాజ్ బవా, షారుఖ్ ఖాన్, భానుక రాజపక్స, బల్ తేజ్ సింగ్.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్ సిమ్రన్ సింగ్, జితేశ్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్ స్టన్, అథర్వ తైదే, అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, శామ్ కరన్, కగిసో రబాడా, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, హర్ ప్రీత్ భాటియా, విద్వత్ కావేరప్ప, శివమ్ సింగ్.
సన్ రైజర్స్ హైదరాబాద్...
ఢిల్లీ క్యాపిటల్స్...
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆవేశ్ ఖాన్ ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తీసుకుంది.