డెనిమ్ షర్ట్ లో కేటీఆర్ అన్న యూత్ లెక్క కనిపిస్తున్నాడు: ఫస్ట్ టైమ్ ఓటర్లతో సమావేశంలో సరదా సంభాషణ
- మీతో పాటు యంగ్‌గా కనిపించాలని ఓ డెనిమ్ షర్ట్... కొద్దిగా జుత్తుకు రంగు వేసుకొని వచ్చానన్న కేటీఆర్
- ఉమ్మడి పది జిల్లాల ఫస్ట్ టైమ్ ఓటర్లతో కేటీఆర్ సమావేశం
- కాలేజీకి అటెండెన్స్ ఎంత ముఖ్యమో... ప్రజాస్వామ్యానికి ఓటు అంతే ముఖ్యమన్న కేటీఆర్
"యాక్చువల్‌గా మనం కాదు... అన్న యూత్ లెక్క అనిపిస్తున్నాడు.. ఈ రోజు డెనిమ్ షర్ట్ వేసుకొచ్చిండు" అంటూ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఓ ఫస్ట్ టైమ్ ఓటర్ అన్నారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ... మీతో పాటు యంగ్‌గా కనిపించాలని ఓ డెనిమ్ షర్ట్... కొద్దిగా జుత్తుకు రంగు వేసుకొని వచ్చానని సరదాగా అన్నారు.
కేటీఆర్ ఆదివారం ఉమ్మడి పది జిల్లాల ఫస్ట్ టైమ్ ఓటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువత తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని సూచించారు.
"మీకు (యువత) లెక్చర్లు ఇవ్వడం ఎక్కువగా ఇష్టం ఉండదు... కానీ మీకు కాలేజీలో అటెండెన్స్ ఎంత ముఖ్యమో... ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అంతే ముఖ్యం" అని చెప్పారు. ఓటు వేయకుంటే కనుక మన ఐడియాలజీ దూరం జరుగుతుందన్నారు. ఎవరైతే ఓటు వేస్తారో... వారు ఈ దేశం తలరాతను మార్చుతారని గుర్తు చేశారు. కాబట్టి అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
రాజకీయ నాయకులందరూ అవినీతిపరులు... అందరూ దొంగలు అన్నట్లుగా సినిమాల్లో చూస్తుంటారని, కానీ అలాంటి వారు రాజకీయాల్లో ఎందుకు ఎదుగుతున్నారో ఆలోచించాలన్నారు. అలాంటి వారు రాజకీయాల్లోకి రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటు అనేది కాలేజీలో అటెండెన్స్ వంటిది... కాబట్టి అలాగే వినియోగించుకోవాలన్నారు.
ఇక. కార్యక్రమ యాంకర్ గా వ్యవహరించిన యువకుడు తనను "అన్నా" అని పిలిచినందుకు కేటీఆర్ సంతోషించారు. "అంకుల్ అని పిలవనందుకు థ్యాంక్స్" అంటూ చమత్కరించారు.