హైదరాబాద్ ఓఆర్ఆర్‌‌పై అర్ధరాత్రి కారు దగ్ధం.. కారులో వ్యక్తి సజీవ దహనం

  • ఆదిభట్ల సమీపంలో ఘటన
  • మృతుడిని కోదాడకు చెందిన వెంకటేశ్‌గా గుర్తింపు
  • ప్రమాదమా? కుట్రా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం ఘటన సంచలనమైంది. గత అర్ధరాత్రి ఆదిభట్లకు సమీపంలో ఓఆర్ఆర్‌పై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ వ్యక్తి అందులోనే సజీవ దహనమయ్యాడు. కారు పూర్తిగా దగ్ధమైంది.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపు చేశారు. మృతుడిని కోదాడకు చెందిన వెంకటేశ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదంటే ఎవరైనా కావాలనే కారుకు నిప్పు పెట్టి చాకచక్యంగా తప్పించుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News