వరల్డ్ కప్‌లో భారత్ ఓటమికి కారణాలు చెప్పిన వసీం అక్రమ్

  • షమీని తొలుత బౌలింగ్‌కు దింపడంతో ఇతర బౌలర్లపై ప్రభావం పడి ఉండొచ్చన్న పాక్ మాజీ క్రికెటర్
  • మ్యాచ్ 2వ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్ల తరువాత వాతావరణం బ్యాటింగ్‌ కు అనుకూలమైందని వెల్లడి
  • పెద్ద మ్యాచుల్లో జట్లు తమకు తెలిసున్న ఫార్ములానే ఫాలో కావాలని సూచన
వరల్డ్ కప్‌లో భారత్ అనూహ్య రీతిలో ఓడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, టీమిండియా కప్ చేజార్చుకున్న తీరుపై పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. పెద్ద మ్యాచుల్లో, జట్లు తమకు తెలిసున్న ఫార్ములానే ఫాలో అవ్వాలని అభిప్రాయపడ్డాడు. తొలుత సిరాజ్‌కు బదులు షమీతో బౌలింగ్ చేయడం ఇతర బౌలర్లపై మానసికంగా ప్రభావం చూపించి ఉండొచ్చని వ్యాఖ్యానించాడు. 

ఆస్ట్రేలియాలో బ్యాటింగ్ సమయంలో తొలి 15 ఓవర్ల తరువాత వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిందని వసీం వ్యాఖ్యానించారు. తేమ పెరగడంతో బంతిపై పట్టుచిక్కక భారత బౌలర్లు అవస్థ పడ్డారని తెలిపాడు. పెద్ద మ్యాచుల్లో జట్లు తమకు అలవాటైన ఫార్ములానే ఫాలో కావాలని వ్యాఖ్యానించాడు. 

టీమిండియా మిడిల్ ఆర్డర్ మరింత రిస్క్ తీసుకుని ఆడి ఉంటే గేమ్ మరోలా ఉండేదని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్ తరువాత బ్యాటింగ్ చేసేందుకు ఎవరూ లేరని, కాబట్టి అతడు జాగ్రత్తగా ఆడటాన్ని తాను అర్థం చేసుకోగలనని కూడా వ్యాఖ్యానించాడు. హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండి ఉంటే రాహుల్ మరింత దూకుడు ప్రదర్శించి ఉండేవాడని వసీం అభిప్రాయపడ్డాడు.


More Telugu News