ద్రావిడ్‌తో బీసీసీఐ చర్చలు.. కొత్త కోచ్ వైపు మొగ్గు!
- కోచ్ పదవిపై ద్రావిడ్‌తో లోతైన చర్చలు జరిపిన బీసీసీఐ
- కొత్త కోచ్ వైపే మొగ్గు చూపుతున్నారంటూ వెలువడుతున్న రిపోర్టులు
- టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించ వచ్చంటూ వార్తలు
టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్ కప్ 2023తో ముగిసిపోయింది. దీంతో తదుపరి కోచ్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై ద్రావిడ్, బీసీసీఐ అధికారులు లోతైన చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి. అయితే కొత్త వ్యక్తికే కోచ్ బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ వర్గాలు మొగ్గు చూపుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్‌సీఏ(నేషనల్ క్రికెట్ అకాడమీ) డైరెక్టర్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ‘‘ ప్రస్తుత పరిస్థితులపై ద్రావిడ్, బీసీసీఐ మధ్య చర్చలు జరిగాయి. అతడు తీసుకునే నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. టీ20 ప్రపంచ కప్‌కు 7-8 నెలల సమయం ఉండడంతో కొత్త కోచ్‌ను తీసుకునే వీలుంది. ఈ సమయంలో ఒక జట్టును తయారు చేసుకోవచ్చు. ఆ విషయం గురించి ద్రావిడ్‌కి కూడా బాగా తెలుసు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయంటూ రిపోర్టులు ప్రస్తావిస్తున్నాయి. అయితే అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే కోచ్ ఎవరనే దానిపై నిర్ణయం ఉంటుందని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.
టీ20 వరల్డ్ కప్‌కి ప్రస్తుతమున్న కోచ్, కెప్టెన్ల కొనసాగింపు అవసరమవుతుందా లేదా అనే విషయంపై మాట్లాడుతున్నామని, దీనిపై త్వరలో ఒక నిర్ణయానికి వస్తామని భావిస్తున్నట్టు సదరు అధికారి పేర్కొన్నారు. ఇదిలావుండగా ద్రావిడ్ హయాంలో ఐసీసీ ట్రోఫీలు గెలవకపోయినప్పటికీ జట్టు ప్రదర్శన బాగానే ఉంది. గత రెండేళ్ల వ్యవధిలో టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్స్, వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్స్ ఆడింది. అయితే ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది.