రేపు ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు తిరుపతి వెళ్లనున్న సీఎం జగన్
- నవంబరు 26, 27 తేదీల్లో తిరుపతి, తిరుమలలో మోదీ పర్యటన
- రేపు సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి సీఎం జగన్
- ప్రధానికి స్వాగతం పలికిన అనంతరం విజయవాడ తిరిగిరాక
- ఈ నెల 27 ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్న ప్రధాని మోదీ
- అనంతరం హైదరాబాద్ పయనం
ప్రధాని నరేంద్ర మోదీ రేపు (నవంబరు 26) తిరుపతి వస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో రాత్రికి బస చేసి నవంబరు 27న శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
కాగా, ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ ఆయనకు స్వాగతం పలికేందుకు రేపు తిరుపతి వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం సీఎం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.
ప్రధాని రాక నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీ పర్యటన నిబంధనలను అనుసరించి తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి సూచనలు చేశారు.
ప్రధాని మోదీ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల కొండపైకి చేరుకునే మార్గం పొడవునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కాగా, తిరుమల పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వెళ్లనున్నారు.