తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల ప్రభుత్వం వస్తుందని సోనియాగాంధీ ఆశపడ్డారు: ప్రియాంక గాంధీ
- మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గానికి రావడం ఆనందంగా ఉందన్న ప్రియాంకగాంధీ
- రాహుల్ భారత్ జోడో యాత్ర తరహా తెలంగాణలో భట్టి పాదయాత్ర చేశారని కితాబు
- పేపర్ లీకులు జరుగుతుంటే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమన్న ప్రియాంకగాంధీ
- తాను 30 నిమిషాలు మాట్లాడితే మూడుసార్లు కరెంట్ పోయిందని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజా ప్రభుత్వం వస్తుందని సోనియాగాంధీ ఆశపడ్డారని, కానీ ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ప్రజల ఆశలు నెరవేరలేదని ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. మధిరలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గానికి రావడం ఆనందంగా ఉందన్నారు. భట్టి పాదయాత్ర చేసినందుకు అభినందిస్తున్నానన్నారు. నిన్న రాత్రి సోనియాగాంధీకి ఫోన్ చేశానని, రేపు భట్టి నియోజకవర్గానికి వెళ్తున్నట్లు చెప్పానన్నారు. భట్టి తెలంగాణ కోసం ఎంతో ఉద్యమించారని ఆమె గుర్తు చేసుకున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహా తెలంగాణలో భట్టి పాదయాత్ర చేశారని కితాబునిచ్చారు. వీరు తమ పాదయాత్రల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం చేయడానికి బలమైన ప్రభుత్వం రాబోతుందని సోనియా గాంధీ బలంగా నమ్ముతున్నారన్నారు. ప్రజల బాధలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలు సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. పెరిగిన ధరలతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పేపర్ లీకులు జరుగుతుంటే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమన్నారు. తాను 30 నిమిషాలు మాట్లాడితే మూడుసార్లు కరెంట్ పోయిందన్నారు.