రేవంత్ రెడ్డికి కొనుగోళ్లు చేయడం అలవాటే: మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ చెబుతున్న మార్పు ఆరు నెలలకో సీఎంను మార్చడమేనని ఎద్దేవా
- కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారన్న కేటీఆర్
- ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్‌కౌంటర్లు. అరాచక పాలన అని ఆగ్రహం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కొనుగోళ్లు చేయడం అలవాటేనని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బిక్కనూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, అలాంటి పార్టీని గెలిపిస్తే అంతే సంగతులు అన్నారు. కాంగ్రెస్ మార్పు అని అంటోందని.. అంటే ఆ మార్పు ఆరు నెలలకు ఓసారి ముఖ్యమంత్రిని మార్చడమని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్‌కౌంటర్లు, అరాచకాల పాలన తీసుకు వస్తారా? అని మండిపడ్డారు.
మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించారని చెప్పారు. మనందరి కోసం పద్నాలుగేళ్ల పాటు ఢిల్లీ రాక్షసులతో పోరాడారన్నారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులు ఈ తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. కొంతమంది లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అసైన్డ్ భూములు ఉన్న వారికే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ గెలిచాక పెన్షన్ పెంచుతామన్నారు. ఏ రాష్ట్రంలోను బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వరని, కేసీఆర్ ఇస్తున్నారన్నారు.