ఆ డ్రెస్ రెడీ చేసుకో.. జగన్ కు లోకేశ్ సూచన
- జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్న లోకేశ్
- ఖైదీ నెంబర్ 6093 డ్రెస్ ఉతికించి పెట్టుకోవాలంటూ వ్యంగ్యం
- ఇటీవలే సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న జగన్
వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బయట అధికారం చెలాయిస్తున్న జగన్ త్వరలోనే జైలుకు వెళతారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. జైలుకు వెళ్లే సమయం దగ్గర పడింది.. అవినీతి చక్రవర్తి జగన్ తనకు కేటాయించిన ఖైదీ నెంబర్ 6093 డ్రెస్ ఉతికించి పెట్టుకోవాలంటూ లోకేశ్ ఎగతాళి చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపీ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. జగన్ తో పాటు సీబీఐకి రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ లోకేశ్ తాజాగా జగన్ పై విమర్శలు గుప్పించారు. పదేళ్లుగా వివిధ కేసులను మేనేజ్ చేస్తూ వచ్చారని, దొంగ సొమ్ముతో వ్యవస్థలను ఇంకెంత కాలం మేనేజ్ చేస్తారని ప్రశ్నించారు.