కూతురు కవిత అరెస్ట్ కాకుండా కేసీఆర్... అమిత్ షా కాళ్లు పట్టుకున్నాడు: సీపీఐ నారాయణ
- కేసీఆర్, కేటీఆర్‌లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆగ్రహం
- వనమా వెంకటేశ్వరరావు డైపర్ లేనిదే బయటకు రాడని ఎద్దేవా
- జలగం వెంకటరావు డబ్బులు పెట్టి బీ ఫామ్, ఎన్నికల గుర్తు కొన్నాడని విమర్శలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కేసులో కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాకుండా ఉండేందుకు కేసీఆర్ కేంద్రమంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. శుక్రవారం కొత్తగూడెంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు.
ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు డైపర్ లేనిదే బయటకు రాడని ఎద్దేవా చేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థి జలగం వెంకటరావు డబ్బులు పెట్టి బీ ఫామ్ కొన్నారని ఆరోపించారు. ఎన్నికల గుర్తు సింహంను కూడా డబ్బులు పెట్టి కొన్నారన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇస్తోందని, ఇక్కడ కూనంనేని సాంబశివరావును గెలిపించాలని కోరారు.