మరో విమానంలో బయల్దేరి విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్
- ఇటీవల విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం
- పెద్ద సంఖ్యలో బోట్ల దగ్ధం
- రూ.50 వేల చొప్పున సాయం అందించనున్న పవన్
- హైదరాబాదులో ప్రత్యేక విమానం రద్దు... మరో విమానం ఎక్కిన పవన్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఇటీవల నగరంలోని ఫిషింగ్ హార్బర్ లో పెద్ద సంఖ్యలో బోట్లు దగ్ధం కాగా, బాధితులకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరగా, సాంకేతిక లోపం కారణంగా ప్రత్యేక విమానం రద్దయింది. దాంతో పవన్ మరో విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరి విశాఖ చేరుకున్నారు.
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు గండి బాబ్జీ, బుద్దా నాగజగదీశ్ నేతృత్వంలో జనసేన పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం, పవన్ నేరుగా విశాఖ ఫిషింగ్ హార్బర్ కు బయల్దేరారు. అక్కడ అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన వారికి రూ.50 వేల చొప్పున సాయం అందించనున్నారు. పవన్ రాకతో విశాఖ జనసైనికుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది.