స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 47 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 7 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • ఒకటిన్నర శాతం నష్టపోయిన హెచ్సీఎల్ టెక్నాలజీస్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు మొత్తం సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 47 పాయింట్లు నష్టపోయి 65,970కి పడిపోయింది. నిఫ్టీ 7 పాయింట్లు కోల్పోయి 19,794 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (0.91%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (0.81%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.68%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.66%), ఎన్టీపీసీ (0.47%). 

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.55%), విప్రో (-1.54%), టీసీఎస్ (-1.46%), టెక్ మహీంద్రా (-0.98%), నెస్లే ఇండియా (-0.97%).



More Telugu News