తప్పుడు కేసు పెట్టిన మహిళకు రూ.లక్ష జరిమానా విధించిన జడ్జి
- మూడు నెలల్లో ఫైన్ కట్టకుంటే 3 నెలల జైలు శిక్ష
- ఆస్తి తగాదాల పరిష్కారం కోసం పోక్సో కేసు
- ఐదేళ్ల కూతురిపై అత్యాచారం చేశారని ఫిర్యాదు
- మహిళ తీరుపై ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు సీరియస్
కుటుంబ ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రత్యర్థులపై తప్పుడు కేసు పెట్టిన ఓ మహిళపై కోర్టు సీరియస్ అయింది. తప్పుడు కేసుతో నిందితుల పరువుకు భంగం కలిగించిందంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మహిళ ఆరోపణలు తప్పని తేలడంతో రూ. లక్ష జరిమానా విధించారు. మూడు నెలల లోగా జరిమానా కట్టకపోతే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఢిల్లీకి చెందిన ఓ మహిళ తన ఐదేళ్ల కూతురిపై కొంతమంది అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల పేర్లు, ఇతర వివరాలు చెప్పడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. ఆపై కేసు దర్యాఫ్తు చేయగా అసలు విషయం బయటపడింది. నిందితులతో సదరు మహిళకు కుటుంబపరమైన ఆస్తి తగాదాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునేందుకు తప్పుడు ఆరోపణలు చేసిందని పోలీసులు తేల్చారు. ఈ కేసుతో నిందితుల ఆస్తిని దోచేయాలని ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.
అత్యాచారం ఆరోపణలు తప్పని పోలీసులు సాక్ష్యాధారాలు సమర్పించడంతో జడ్జి సుశీల్ బాల డాగర్ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి తగాదాల పరిష్కారం కోసం ఇతర మార్గాలు ఉండగా ఇలా తప్పుడు ఆరోపణలు చేయడంపై సీరియస్ అయ్యారు. ఇలా చట్టాలను మరొకరు దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే ఈ కేసులో కఠినంగా వ్యవహరించాల్సేందనని చెప్పారు. సదరు మహిళకు భారీ జరిమానా విధిస్తూ.. గడువులోగా ఫైన్ కట్టకపోతే జైలుకు పంపించాలని పోలీసులను ఆదేశించారు.