తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు

  • తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపుగా గాలులు
  • గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం 
  • వాతావరణ శాఖ వెల్లడి
వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు తెలంగాణ వైపు వీస్తున్నట్టు పేర్కొంది. కాగా, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా దామరచర్లలో అత్యధికంగా 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్‌లో అత్యల్పంగా 17 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


More Telugu News